
పక్షం రోజుల్లో హెల్త్‌కార్డులు
● పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
పుల్గం దామోదర్‌రెడ్డి
కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పదిహేను రోజుల్లో హెల్త్‌కార్డులు అందనున్నాయని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి తెలిపారు. వాటితో కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్సలు పొందవచ్చన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత ఆయన తొలిసారి గురువారం కామారెడ్డికి వచ్చారు. కామారెడ్డిలోని పీఆర్టీయూ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గురుకుల, కేజీబీవీ, ఆదర్శ, ఇతర గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయులకూ నగదు రహిత చికిత్సల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. మరో 15 రోజుల్లో నాలుగు వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రానున్నాయన్నారు. గురుకుల పాఠశాలల పనివేళలు మార్పు చేయాలని తాము చేసిన విజ్ఞప్తి మేరకు ఉదయం 9 గంటలకు మార్పు చేశారని తెలిపారు. 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు, 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. తనకు పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం కల్పించిన కామారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గర్దాస్ గోవర్ధన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లాపూర్ కుషాల్, పుట్ట శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వీరేందర్‌గౌడ్, ప్రేమ్‌గిరి, బసంత్‌రాజ్, రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాసాచారి, రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.