
దేశాభివృద్ధిలో యూనివర్సిటీలది కీలకపాత్ర
● రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి
భిక్కనూరు: దేశాభివృద్ధిలో యూనివర్సిటీలు కీలక పాత్ర పోషిస్తాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి పేర్కొన్నారు. మేధావులను తయారు చేసే ఫ్యాక్టరీలుగా యూనివర్సిటీలు నిలుస్తున్నాయన్నారు. గురువారం ఆయన భి క్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌క్యాంపస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీల్లో నూత న సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని శాస్త్రవేత్తల సహకారంతో అభివృద్ధి చెందాలని సూచించారు. సాంఘిక మార్పులను విద్యార్థులకు తెలియజేసి, వారిలో మార్పు తీసుకురావాలని, ఆన్‌లైన్ డిజిటల్ కామర్స్‌ను వినియోగించుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో తయారైన వస్తువులను సైతం ప్రపంచానికి పరిచయం చేయవచ్చని పేర్కొన్నారు. విద్యతో పాటు ఇంటర్న్‌షిప్ కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు చక్రపాణిని సత్కరించారు. ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, అధ్యాపకులు యాలాద్రి, వైశాలి, సరిత, అంజయ్య, మోహన్, నారాయణ, ప్రతిజ్ఞ, నాగరాజు, నిరంజన్, శ్రీకాంత్, దిలీప్, శ్రీమాత పాల్గొన్నారు.
దోమకొండ: విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈవో రాజు, ఏఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని గడికోటలో గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడలు నిర్వహించారు. విజేతలకు డీఈవో, ఏఎస్పీ బహుమతులు అందించారు. క్రీడలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా జీవితంలో క్రమశిక్ష ణ, స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు గెలుపు కోసం ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో భిక్కనూరు సీఐ సంపత్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమలగౌడ్, ట్రస్టు మేనేజర్ బాబ్జీ, ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధిలో యూనివర్సిటీలది కీలకపాత్ర