ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి రూరల్: విశ్వ బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి సమాజంలో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం దేవునిపల్లిలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి, పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విశ్వకర్మ జయంతి ప్రాధాన్యతను వివరిస్తూ ఆయన ఆశీస్సులతో కార్మికుల సంక్షేమం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు, దేవునిపల్లి అధ్యక్షుడు వడ్ల వెంకటరమణ, గౌరవ అధ్యక్షుడు రాములు చారి, ప్రధాన కార్యదర్శి లింబాద్రిచారి, కోశాధికారి మురళి చారి, ఉపాధ్యక్షుడు రమేష్ చారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
వరద బాధిత విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు
కామారెడ్డి టౌన్: ఏబీవీపీ ఆధ్వర్యంలో వరద బాధిత విద్యార్థుల కోసం సేకరించిన పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రి పంపిణీ వాహనాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల వర్షం బీభత్సం వల్ల కాలనీలు జలమయం కావడంతో భారీ నష్టంతో పాటు విద్యార్థులకు నష్టం కలిగిందన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘గిఫ్ట్ ఏ నోట్ బుక్’ పేరిట కార్యక్రమం చేపట్టి విద్యార్థులకు సామాగ్రి పంపిణీ చేయబోవడం అభినందనీయమన్నారు. ఏబీవీపీ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజిత్ మోహన్, నాయకులు పాల్గొన్నారు.
పాఠశాలకు టీవీ వితరణ
మాచారెడ్డి: మండల కేంద్రంలోని శ్రీరామ్ నగ ర్ ప్రాథమిక పాఠశాలకు బుధవారం అదే గ్రా మానికి చెందిన పూర్వ విద్యార్థి రాగుల నర్సింగరావు మన బడి పూర్వ విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రూ.50 వేల విలువైన టీవీని అందజేశారు. ఐక్య వేదిక అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయడానికి టీవీ తోడ్పడుతుందని అన్నారు.పాఠశాల హెచ్‌ఎం స్వ ప్న.. దాతతో పాటు పూర్వ విద్యార్థుల ఐక్య వే దిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు సుష్మ, ఐక్య వేదిక సభ్యులు కలిమెల రాజిరెడ్డి, రాగుల దేవరాజు, చల్ల కృష్ణారెడ్డి ఉన్నారు.

ఐక్యంగా ఉండి సమాజంలో ముందుకు పోవాలి