
తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ చరిత్రను 1948 సె ప్టెంబర్ 17 మలుపుతిప్పిన రోజని, శతాబ్దాల బాని స సంకెళ్లను తుంచి స్వాతంత్య్రం పొందిన ఉద్విఘ్న సందర్భమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ ఫెసర్ యాదగిరిరావు అన్నారు. ప్రజాపాలన దినో త్సవం సందర్భంగా బుధవారం తెయూ పరిపాల నా భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజరికం పరిసమాప్తమై తెలంగాణ సమాజం నిజాం కబందహస్తాల నుంచి విమోచన పొందిన రోజన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, అ ధ్యాపకులు పాత నాగరాజు, శాంతాబాయి, పీఆ ర్వో పున్నయ్య, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.