
గ్రామాల్లో మహిళలకు వైద్య పరీక్షలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పీహెచ్‌సీతో పాటు పోల్కంపేట, పోతాయిపల్లి, మోతె, బాణాపూర్, భవానిపేట, ముంబోజిపేట తదితర గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ‘స్వస్త్ నారీ..స్వశక్త్‌నారీ’ కార్యక్రమంలో భాగంగా 56 మందికి పరీక్షలు చేసి చికిత్స అందజేశారు. కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ రమాదేవి, పీహెచ్‌సీ వైద్యులు రాంబాయి, సీహెచ్‌వో రమేశ్, పర్యవేక్షకులు ఫరీదా, చంద్రకళ, యాదగిరి, గీత, భాగ్య, అంజలి, పాలవ్వ, కవిత, తదితరులు పాల్గొన్నారు.
హన్మాజీపేట్ పీహెచ్‌సీ పరిధిలో..
బాన్సువాడ రూరల్: స్వస్త్‌నారీ..స్వశక్త్‌నారీ కార్యక్ర మం బుధవారం హన్మాజీపేట్ పీహెచ్‌సీలో ప్రారంభించారు. కార్యక్రమం వచ్చే నెల 2 వరకు కొనసాగుతుందని పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ ఇమ్రాన్ తెలిపారు. తొలిరోజు మహిళలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజు మహిళలకు దీర్ఘకాలిక రోగా లు, బీపీ, షుగర్, టీబీ, గుండెపోటు, పక్షవాతం, రక్తనాళాలు దెబ్బతినడం తదితర వ్యాధులకు పరీ క్షించి ఉచితంగా వైద్యం అందజేస్తామని డాక్టర్ తెలిపారు. కోనాపూర్‌లోనూ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.

గ్రామాల్లో మహిళలకు వైద్య పరీక్షలు