
సరైన పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజం
బాన్సువాడ రూరల్: సరైన పోషణతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని బాన్సువాడ సీడీపీవో సౌభాగ్య అన్నారు. తాడ్కోల్ రైతువేదికలో సీ్త్రశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ బీ..పడాయి బీ మాసోత్సవంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 3 రోజులుగా వివిధ సెక్టార్‌లకు చెందిన సూపర్‌వైజర్లు కార్యక్రమం విజయవంతానికి అంగన్‌వాడీ టీచర్లు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారన్నారు. అక్టోబర్ 16 వరకు జరిగే పోషణ మాసాన్ని విజయవంతం చేయాలని కోరారు. సూపర్‌వైజర్లు షహనాజ్‌బేగం, రాజేశ్వరి, పద్మ, సుమలత, మాధురి, తదితరులు పాల్గొన్నారు.
క్యాసంపల్లిలో..
కామారెడ్డి రూరల్: క్యాసంపల్లి రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లకు పోషణ్ బీ పడాయి బీ కార్యక్రమంపై శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌లు, పోషన్ అభియాన్ కో–ఆర్డినేటర్, 100 మంది అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.