
వరదలతో రూ.6.59 కోట్ల నష్టం
● ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇటీవల జిల్లాలో కురిసిన భారీవర్షాలతో విద్యుత్‌శాఖకు రూ.6.59 కోట్ల నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ తెలిపారు. చీనూర్, వెంకంపల్లి గ్రామాల్లో జరుగుతున్న విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను సోమవారం ఆయన పరిశీలించారు. వరదల వల్ల ముంపునకు గురై తేలిన పంటలను కాపాడేందుకు తక్షణమే మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో 589 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం కావడంతోపాటు 864 విద్యుత్ స్తంభాలు నేలకూలాయన్నారు. కాగా ఇప్పటివరకు 350 ట్రాన్స్‌ఫార్మర్లను బిగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని చెప్పారు. ట్రాన్స్‌కో డీఈఈ విజయసారథి, ఏడీఈ ప్రసాద్‌రెడ్డి, లైన్‌మెన్ సురేందర్, తాండూర్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, సీడీసీ డైరెక్టర్ పీర్‌రెడ్డి ఉన్నారు.