
అధికారుల కోసం ఎదురుచూపులు
బిచ్కుంద(జుక్కల్): ప్రతి సోమవారం బిచ్కుంద తహసీల్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి కొన్ని శాఖల అధికారులు మాత్రమే వచ్చారు. వ్యవసాయ, పీఆర్, విద్య శాఖల అధికారుల రాక కోసం రైతులు, ప్రజలు ఎదురుచూశారు. తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో గోపాల్, మున్సిపల్ కమిషనర్ ఖయ్యుం, ఎంపీవో కృష్ణ, ఏపీఎం రవీందర్ మాత్రమే ప్రజావాణిలో పాల్గొన్నారు. మిగత ఆయా శాఖల అధికారులు పాల్గొనలేదు. ప్రజావాణిలో వినతులు ఇవ్వడానికి వచ్చిన ప్రజలు, రైతులు అధికారుల రాక కోసం మధ్యాహ్నం వరకు ఎదురుచూశారు. సంబంధిత అధికారులు ఎంతకీ రాకపోవడంతో నిరాశతో వెళ్లిపోయారు.