ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

Aug 1 2025 1:30 PM | Updated on Aug 1 2025 1:30 PM

ఇళ్ల

ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వందశాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అధికారులకు సూచించారు. గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనులను ప్రతి జీపీ కార్యదర్శిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమైన చోట పనులు వేగంగా పూర్తి చేయాలని, ప్రారంభం కాని చోట పనులు ప్రారంభమయ్యే లా చూడాలన్నారు. పనులు సకాలంలో ప్రారంభించని పక్షంలో ఇందిరమ్మ ఇళ్లు రద్దవుతాయని లబ్ధిదారులకు సూచించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభంకాని వారికి వారి వారి గ్రామాలలోని డ్వాక్రా సంఘాల ద్వారా ఇంటి నిర్మా ణానికి రుణాలను ఇప్పించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అటవీభూమికి సంబంధించిన సమస్యలు ఉన్న ప్రాంతాలలో ఆర్డీవో దానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు.అధికారులు సైతం పనులు ప్రారంభించిన వారికి సంబంధించిన బిల్లులు చె ల్లించడంలో ఎలాంటి జాప్యం చేయకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పార్థసింహారెడ్డి, హౌజింగ్‌ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, డీపీవో మురళి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ రజిత, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, డీఎల్‌పీవోలు, హౌజింగ్‌ ఏఈలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు,మండల కాంగ్రెస్‌ పార్టీల అధ్యక్షులు సాయిబాబా, శ్రీధర్‌గౌడ్‌ తదితరులున్నారు.

ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును కలిసిన జిల్లా వ్యవసాయశాఖ అధికారులు

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావును జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంటల సాగు, ఎరువులు వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో మధ్యంతరంగా నిలిచిన వ్యవసాయశాఖ భవన నిర్మాణానికి సంబంధించిన పనులు జరిగేలా చూడాలని వారు కోరారు. ఏడీఏ సుధామాధురి, ఏవోలు అనిల్‌, రాజలింగం, నదిమోద్దీన్‌ తదితరులున్నారు.

జాతీయ ఓబీసీ మహాసభ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

జాతీయ ఓబీసీ మహాసభ వాల్‌పోస్టర్లను ఓబీసీ సంఘం నాయకులు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈనెల 7న గోవాలో జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు శివరాములు, నాగరాజులు తెలిపారు. జాతీయ మహాసభకు ఓబీసీ సంఘం నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు. కార్యక్రమంలో ఓబీసీ సంఘం నాయకులు భూమన్న తదితరులున్నారు.

వందశాతం ఇందిరమ్మ

ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు

ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి 1
1/1

ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement