
ఆరున్నర దశాబ్దాల చెలిమి..
లింగంపేట: మండల కేంద్రానికి చెందిన అంకం కొండయ్య చిస్తికి 80 ఏళ్లు. బొల్లు నర్సింలు వయసు 79 సంవత్సరాలు. కొండయ్య ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. బొల్లు నర్సింలు ప్రాథమిక స్థాయి విద్యాభ్యాసం చేసి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. వీరిది ఆరున్నర దశాబ్దాల చెలిమి. వీరి పొలాలు పక్కపక్కనే ఉండడంతో సెలవు రోజుల్లో వ్యవసాయ పనులకు వెళ్లి కలిసి పనులు చేసేవారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఇద్దరు కలిసి సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కొండయ్య చిస్తీ వెంకటఖాజా భక్తుడు, నర్సింలు అచలగురు భక్తుడు. వీరు ఇరువురు ఆశ్రమాలు ఒకేచోట నిర్మించుకున్నారు. ఏటా వెంకట ఖాజా ఆశ్రమంలో జెండా ఉత్సవాలు, అచలగురు ఆశ్రమంలో గురుపూజోత్సవం కలిసి నిర్వహిస్తారు. ఆశ్రమాల్లో ప్రతినెల భజనలు జరుగుతాయి. పండుగల సమయంలో అన్నదానం చేస్తారు.