
స్నేహమనే మాటలో చెరో అక్షరం..
భిక్కనూరు : భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన నయీం, మౌలానా ఇద్దరూ స్నేహితులు. యాదృశ్చికంగా వారిద్దరు జన్మించింది 1952 సంవత్సరంలోనే.. వీరిద్దరు చిన్నప్పటినుంచే దోస్తులు. స్కూల్‌కు కలిసే వెళ్లేవారు. ఇద్దరూ ఏడో తరగతి దాకా చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఎలక్ట్రీషన్ పని నేర్చుకున్నారు. 1972 లో కలిసే ఉపాధి మస్కట్‌కు వెళ్లారు. అక్కడ బిలాబిన్ అనే కంపెనీలో పనిచేశారు. ఒకేచోట ఉన్నారు. సెలవులకోసం స్వదేశానికి సైతం ఇద్దరూ కలిసే వచ్చేవారు. తిరిగి మస్కట్‌కు కలిసే వెళ్లేవారు. 2016 లో ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామానికి వచ్చారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయేవరకు నయిం, మౌలానా కలిసే ఉంటారు. ఒకే బైక్‌పై తిరుగుతారు. వారిని ఊరోళ్లంతా జోడీదార్ అని పిలుస్తుంటారు.