
లింబాద్రి గుట్ట మీదుగా టెంపుల్ కారిడార్
ఆర్మూర్ : జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి వేములవాడ, లింబాద్రి గుట్ట మీదుగా బాసర వరకు నాలుగు లేన్లతో టెంపుల్ కారిడార్ నిర్మాణానికి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో ఈ కారిడార్ మంజూరవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనహిత పాదయాత్రను శనివారం నిర్వహించారు. ఆర్మూర్‌లోని ఆలూర్ రోడ్డులో మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించగా, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని కాశీ హనుమాన్ మున్నూరు కాపు సంఘ భవనంలో రైతులు, లబ్ధిదారులతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుల జిల్లా అయిన నిజామాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఉత్తర తెలంగాణలోనే మేటి జిల్లాగా తీర్చిదిద్దుతామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. డి శ్రీనివాస్ రెండు పర్యాయాలు తాను మొదటి సారి ఈ జిల్లా నుంచే టీపీసీసీ స్థానాలకు ఎంపికయ్యామన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు ఇప్పించిన తమ ప్రభుత్వం త్వరలో వ్యవసాయ కళాశాలను సైతం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని సీ కన్వెన్షన్ హాల్‌లో బస చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తదితరులు మాట్లాడారు.
సీఎంతో మాట్లాడిన రైతులు..
ధరణి సమస్యలను పరిష్కరించాలని రైతులు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె రైతులను సీఎం రేవంత్ రెడ్డితో నేరుగా మాట్లాడించి భూభారతిలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, భూపతిరెడ్డి, లక్ష్మీకాంతా రావు, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, డీసీసీ ఆధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి వెంట రాగా అక్కడి నుంచి గోల్ బంగ్లా, పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు పాద యాత్ర నిర్వహించారు. కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ చౌరస్తా వరకు పాద యాత్ర కొనసాగింది. పెర్కిట్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడైనప్పటికీ బీసీ, దళిత, మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడని కొనియాడారు.
ధర్మపురి నుంచి బాసర వరకు..
జనహిత పాదయాత్రలో
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్