
గుడ్ల సరఫరాకు టెండర్ల ప్రక్రియ
కామారెడ్డి క్రైం: అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, హాస్టళ్లకు 2025–26 సంవత్సరానికి గాను కోడి గుడ్లను సరఫరా చేసేందుకు టెండర్ ప్రక్రియను నిర్వహించారు. ఆన్‌లైన్ ద్వారా ఇదివరకు వేసిన బిడ్‌లను కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమక్షంలో తెరిచారు. ఇద్దరు బిడ్డర్లు మాత్రమే టెండర్‌ల ప్రక్రియలో పాల్గొన్నారు. సదరు బిడ్డర్ల నుంచి అందిన టెక్నికల్ బిడ్‌లను నిబంధనల ప్రకారం పరిశీలించి టెండర్లు కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఇంజనీరింగ్ కళాశాల
మంజూరు హర్షణీయం
కామారెడ్డి అర్బన్: తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయడం హర్షణీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తులు, ఇన్‌చార్జి మంత్రి సీతక్క కృషి ఫలితంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేశారని, దీంతో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు మేలు కలుగుతుందన్నారు.
ప్రేమ్ చంద్ రచనల్లో
గ్రామీణ జీవితం కనిపిస్తోంది
భిక్కనూరు/కామారెడ్డి అర్బన్ : ప్రముఖ హిందీ న వల రచయిత ప్రేమ్ చంద్ రచనల్లో గ్రామీణ జీవి తం గ్రామీణ వ్యవహరాలు అనుబంధాలు ఉంటా యని జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు గపూర్ శిక్షక్ అన్నారు. గురువారం మండలంలోని జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రేమ్ చంద్ జయంతిని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కవి ప్రేమ్‌చంద్ జయంతిని నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. హిందీ విభాగ అధిపతి డాక్టర్ జి.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ జాతీయ సాహిత్యంలో ప్రేమ్‌చంద్ గోదాన్ నవల ప్రసిద్ధి చెందిందన్నారు. విద్యార్థులకు హిందీ వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రశంసాపత్రాలు,బహుమతులు అందజేశా రు. వైస్ ప్రిన్సిపల్ కే.కిష్టయ్య, సమన్వయకర్తలు పి.విశ్వప్రసాద్, బాలాజీ, ఉపాధ్యాయులు తబిత, ప్రవీణ, లింగం, సత్యనారాయణ, బాల రాజయ్యలు తదితరులు పాల్గొన్నారు.
68 మంది బాల
కార్మికుల గుర్తింపు
● ముగిసిన ఆపరేషన్ ముస్కాన్–11
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి 31వ తేదీ వరకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–11 లో 68 మంది బాల కార్మికులను గుర్తించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్, రెవెన్యూ, కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యాశాఖ, చైల్డ్ లైన్ 1098 ల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇందుకోసం డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలకార్మికులు, వీధి బాలల, తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, రక్షణ కల్పించడం చర్యలు చేపట్టామన్నారు. మొత్తం 68 మంది పిల్లలను రక్షించామన్నారు. అందులో 9 మంది బాలికలు, 59 మంది బాలురు ఉన్నట్లు వెల్లడించారు. వారిలో ఐదుగురు వీధి బాలల, 30 మంది బాల కార్మికులు, 33 మంది బడి బయట పిల్లలు ఉన్నట్లు తెలిపారు. బాలల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తు, విద్య ప్రాముఖ్యతపై కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం పిల్లలందరినీ అందుబాటులో ఉన్న పాఠశాలల్లో చేర్పించామన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లల హక్కులను కాపాడడం, వారి భవిష్యత్తును మెరుగుపరచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

గుడ్ల సరఫరాకు టెండర్ల ప్రక్రియ