మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

Aug 1 2025 1:30 PM | Updated on Aug 1 2025 1:30 PM

మోసం

మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

బాన్సువాడ రూరల్‌: బీర్కూర్‌ గ్రామానికి చెందిన నర్రసాయిలు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన నల్లజెరు జ్యోతిని పెళ్లి చేసుకుని మోసం చేశాడని అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం మాల సంఘం ప్రతినిధులు డీఎస్పీ విఠల్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని కోరితే జ్యోతితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయించాడని ఆరోపించారు. తప్పుడు కేసులను కొట్టివేయడంతో పాటు జ్యోతి, ఆమె కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు బంగారు మైసయ్య, మల్లూరు సాయిలు, ప్రశాంత్‌, బాలసాయిలు, మన్నె సాయిలు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 30, 30(ఏ) పోలీస్‌ యాక్ట్‌ అమలు

కామారెడ్డి క్రైం: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 1 నుంచి 30 వ తేదీ వరకు 30, 30(ఏ) పోలీసు యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేశ్‌ చంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని అన్నా రు. ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే సంబంధిత డివిజన్‌ పోలీసు అధికారులను సంప్రదించి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసు లు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.

బాధ్యతగా విధులు

నిర్వహించాలి

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): బాధ్యతగా విధులు నిర్వహించాలని సీఐ రవీందర్‌ పోలీస్‌ సిబ్బందికి సూచించారు.గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సీఐ రవీందర్‌ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి క్రైం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహనదారులకు, సైబర్‌ క్రైంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పౌరులు హక్కులను

వినియోగించుకోవాలి

మద్నూర్‌(జుక్కల్‌): ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవాలని డోంగ్లీ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ సాయిబాబా పేర్కొన్నారు. డోంగ్లీ మండలంలోని మదన్‌హిప్పర్గాలో గురువారం సివిల్‌రైట్స్‌డే నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు సమాజంలో అంటరాని తనాన్ని రూపుమాపాలని సూచించారు. ప్రతి నెలా చివరి రోజున గ్రామాలలో సివిల్‌ రైట్స్‌ డే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.

మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి 1
1/2

మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి 2
2/2

మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement