బ్రిడ్జి సైడ్‌వాల్‌ను ఢీకొట్టిన లారీ | - | Sakshi
Sakshi News home page

బ్రిడ్జి సైడ్‌వాల్‌ను ఢీకొట్టిన లారీ

Aug 1 2025 1:30 PM | Updated on Aug 1 2025 1:30 PM

బ్రిడ

బ్రిడ్జి సైడ్‌వాల్‌ను ఢీకొట్టిన లారీ

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 161 పై ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్టీరింగ్‌ వైఫల్యం కారణంగా లారీ హైవే బ్రిడ్జిపై సైడ్‌వాల్‌ ను ఢీకొట్టడంతో క్యాబిన్‌లో కూర్చున్న ఐదుగురు కూలీలు పైనుంచి సర్వీస్‌ రోడ్డుపై పడిపోయారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి ప రిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన ముగ్గురి ని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గురువారం పిట్లం మండలం నుంచి ఇటుక లోడ్‌ చేసుకొని మద్నూర్‌కు వెళ్లిన లారీ (ఏపీ 26 ఎక్స్‌ 1377) తిరిగి వస్తుండగా.. పెద్దకొడప్‌గ ల్‌లో నేషనల్‌ హైవే 161 బ్రిడ్జిపై స్టీరింగ్‌ ఫెయిలై సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది. క్యాబిన్‌లో డ్రైవర్‌తోపాటు ఐదుగురు కూలీలు కూర్చున్నారు. లారీ సైడ్‌వాల్‌ ను ఢీ కొట్టగానే డ్రైవర్‌ మినహా ఐదురు కూలీలు క్యాబిన్‌లో నుంచి కింద ఉన్న సర్వీస్‌రోడ్డుపై పడిపోయారు. పిట్లం మండలం రూం తండాకు చెందిన హలావత్‌ నర్సింగ్‌(30) అక్కడికక్కడే మృతి చెందాడు. మహారాష్ట్రకు చెందిన గణేశ్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు చెందిన బింబాటో, రూం తండాకు చెందిన శోభన్‌, హలావత్‌ రమేశ్‌కు గాయాలుకాగా.. చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరి యా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

బ్రిడ్జిపై సైడ్‌ వాల్‌ ను ఢీకొని ఆగిన లారీ

ఎన్‌హెచ్‌ 161 పై ఘోర ప్రమాదం

పైనుంచి సర్వీస్‌ రోడ్డుపై పడిన ఐదుగురు కూలీలు

ఒకరి మృతి.. మరొకరి

పరిస్థితి విషమం

ప్రమాదానికి స్టీరింగ్‌

వైఫల్యమే కారణం

బ్రిడ్జి సైడ్‌వాల్‌ను ఢీకొట్టిన లారీ 1
1/1

బ్రిడ్జి సైడ్‌వాల్‌ను ఢీకొట్టిన లారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement