
వనమహోత్సవం అందరి బాధ్యత
భిక్కనూరు: వన క్షేమమే.. మనందరి క్షేమమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ ఆశి ష్ సంగ్వాన్ అన్నారు. తెలంగాణ యునివర్సీటీ సౌత్‌క్యాంపస్‌లో గురువారం వనమహోత్సవం నిర్వహించగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటా రు.ఆయన మాట్లాడుతూ.. వనమహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని, భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. సౌత్ క్యాంపస్‌లో 30 వేల మొక్కలను నాటేందుకు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మొక్కలను స్పాన్సర్‌చేసిన అధ్యాపకులు డాక్టర్ యాలాద్రి, డాక్టర్‌ప్రతిజ్ఞలను కలెక్టర్ స త్కరించి అభినందించారు. ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి సురేందర్, ఎంపీడీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, త హసీల్దార్ సునీత, ఆర్‌ఐ బాలయ్య, ఇంజినీరింగ్ అధి కారి రాధిక,అధ్యాపకులు మోహన్,సరిత,రమాదేవి, నర్సయ్య,అంజయ్య,నాగరాజు, శ్రీకాంత్, శర్మ, దిలీ ప్, సంతోష్‌గౌడ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్