కామారెడ్డి రూరల్: మానవ అక్రమ రవాణాను అరికడదామని మానవ అభివృద్ధి విభాగం డీపీఎం రమేష్‌బాబు అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో జిల్లాలోని 8 మండలాల ఐకేపీ ఏపీఎంలకు, సీసీలకు మానవ అక్రమ రవాణా అంశంపై గురువారం శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలలు అక్రమ రవాణాకు గురవుతున్నట్లు గమనిస్తే డయల్ 100, చైల్డ్‌లైన్ 1098, ఉమెన్స్ హెల్ప్‌లైన్ 181 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. మానవ అక్రమ రవాణాపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, టీవోటీలు రాజేందర్, జగదీష్ కుమార్, శ్రీనివాస్, అన్నపూర్ణ, గీత తదితరులు పాల్గొన్నారు.
ఒక రోజు శిక్షణ కార్యక్రమం
నస్రుల్లాబాద్/దోమకొండ : మానవ అక్రమ రవాణా నిర్మూలనకు అందరూ కృషి చేయాలని దోమకొండ ఐకేపీ రాజు అన్నారు. దోమకొండ మండల సమాఖ్య కార్యాలయంలో, నస్రుల్లాబాద్ ఐకేపీ కార్యాలయంలో గురువారం గ్రామ సంఘాల కార్యకర్తలు, గ్రామ సంఘాల సభ్యులకు మానవ అక్రమ రవాణా నిరోధంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా దోమకొండ ఐకేపీ రాజు, నస్రుల్లాబాద్ ఏపీఎం గంగాధర్ మాట్లాడారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సీసీలు రమేష్, రాజు, రవి, శ్రీనివాస్, సుజాత,నాగరాజ కుమారి,హన్మండ్లు, నస్రుల్లాబాద్ మహిళా సంఘం అధ్యక్షురాలు శోభారాణి, గ్రామ సంఘం కార్యకర్తలు, గ్రామ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మానవ అభివృద్ధి విభాగం డీపీఎం రమేష్‌బాబు