రాజంపేట సెంటర్‌లో హాల్‌టికెట్ నంబర్లు
వేస్తున్న సిబ్బంది
నిజాంసాగర్/కామారెడ్డి టౌన్ : జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ప్రారంభమయ్యే పరీక్షలు వచ్చేనెల 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 12,579 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 6,127 మంది, బాలికలు 6,452 మంది ఉన్నారు. వీరికోసం 64 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు ఇప్పటికే పరీక్ష కేంద్రాలలో అవసరమైన వసతులు కల్పించారు.