అబద్ధాలకు, అరాచకాలకు కేరాఫ్ బాబు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అబద్ధాలు, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా చంద్రబాబు అండ్ కో నిలుస్తున్నారని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మరో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. జిల్లాలోని నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో పార్టీ కమిటీల నియామకాలపై కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో దాడిశెట్టి రాజా అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ అంశంపై పార్టీ టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రతినిధి బొడ్డేటి ప్రసాద్ సమక్షంలో నేతలు చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిష్టానం ముందుగా నిర్దేశించిన 45 రోజుల గడువులోగా అన్ని స్థాయిల్లోనూ కమిటీలతో పాటు అనుబంధ కమిటీల నియామకాన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు.
బాధిత ప్రజల తరఫున గళమెత్తాలి
కన్నబాబు మాట్లాడుతూ, ప్రజలు, బాధితుల గళమై పార్టీ కార్యకర్తలు, నేతలు నిలవాలని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సోషల్ మీడియా కమిటీలను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం పార్టీ అభ్యున్నతికి చురుకై న పాత్ర పోషిస్తారని చెప్పారు.
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, విశాఖలో ఎకరం భూమి 99 పైసలకే ఇచ్చినట్టుగా అమరావతిలో కూడా చంద్రబాబు ఇవ్వగలరా అని ప్రశ్నించారు. అమరావతిలో రాజధానిని మెరక ప్రాంతంలో నిర్మించాలనే వాస్తవాన్ని వివరించిన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అన్నారు. చంద్రబాబు పాలన తీరు చూస్తూంటే రాష్ట్రంలోని భూములన్నింటినీ 99 పైసలకే అమ్మేసేటట్లు ఉందని విమర్శించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను బడా సంస్థలకు అయినకాడికి తెగనమ్మేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని ఆక్షేపించారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుని ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలని రాజా పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఎమ్మెల్సీ అనంత బాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ కాకినాడ పార్లమెంటరీ పరిశీలకుడు డి.సూర్యనారాయణరాజు, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీతా విశ్వనాథ్, మాజీ మంత్రి, పార్టీ జగ్గంపేట కో ఆర్డినేటర్ తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే, కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, మాజీ ఎమ్మెల్సీ, అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అంగులూరి లక్ష్మీశివకుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వాసిరెడ్డి జమీలు, కొప్పన శివ, ఒమ్మి రఘురామ్, జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఉపాధ్యక్షులు జమ్మలమడక నాగమణి, మాకినీడి శేషుకుమారి, జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, అనుబంధ విభాగాల అధికార ప్రతినిధి లాలం బాబ్జీ, అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), శెట్టిబత్తుల కుమార్‌రాజా, అల్లి రాజబాబు, కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.
ఫ సోషల్ మీడియాతో ఆగడాలకు అడ్డుకట్ట
ఫ గడువులోగా పార్టీ కమిటీలు పూర్తి చేయాలి
ఫ భూములన్నీ అమ్మేస్తారా?
ఫ వైఎస్సార్ సీపీ నేతలు కన్నబాబు, దాడిశెట్టి రాజా
అబద్ధాలకు, అరాచకాలకు కేరాఫ్ బాబు


