రోడ్డు భద్రతపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రతపై ఫోకస్‌

Jan 8 2026 7:09 AM | Updated on Jan 8 2026 7:09 AM

రోడ్డ

రోడ్డు భద్రతపై ఫోకస్‌

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రోడ్డు భద్రతపై రవాణాశాఖ ఫోకస్‌ పెట్టింది. నెలరోజుల పాటు దీనిపై ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఇది విజయవంతం కావడానికి వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటోంది. ఏడాదికి ఒక పర్యాయం వారం రోజులు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించేది. గత ఏడాది నుంచి నెల రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది శిక్షణతో భద్రత–సాంకేతికత ద్వారా పరివర్తన –26 అనే నినాదంతో ఈ నెల 31 వరకూ ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ మాసోత్సవాలు నిర్వహించనుంది. పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, వైద్య, ఆరోగ్యం తదితర శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది హాజరవుతున్నారు. 8వ తేదిన వాక్‌ధాన్‌, 9వ తేదిన జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ర్యాలీ, 10వ తేదీన ఎల్‌ఎల్‌ఆర్‌పై అవగాహన, 11వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌, 12వ తేదీన కంటి వైద్య పరీక్షలు, 13న ఆర్‌టీసీ కార్యాలయాల్లో అవగాహన, 14న హెల్మ్‌ఽట్‌ వాడకంపై వాహన దారులకు పువ్వు ఇవ్వడం, 15న వాష్‌ అండ్‌ గో ప్రోగ్రాంలో భాగంగా అర్ధరాత్రి వాహనాలు ఆపి ఫేస్‌ వాష్‌ చేయించడంతో పాటు టీ ఇవ్వడం, 17న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అరికట్టడం, 18న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌, 19న హెల్మెట్‌ ర్యాలీ, 20న వాక్‌థాన్‌, 21న ప్రభుత్వ స్కూల్స్‌, కళాశాలల్లో రోడ్డు భద్రతపై అవగాహన, 22న సెమినార్‌, 23న ప్రైవేట్‌ స్కూళ్లలో అవగాహన, 24న జేఎన్‌టీయూకేలో నిపుణులతో అవగాహన, 25, 26న సీట్‌బెల్ట్‌, హెల్మెట్‌పై ప్రత్యేక డ్రైవ్‌, 27న అంబేడ్కర్‌ భవన్‌లో డ్రైవర్లకు అవగాహన, 28న క్యాబ్‌,డ్రైవర్స్‌కు అవగాహన, 29న బైక్‌ర్యాలీ, 30 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సదస్సు, 31న ముగింపు సభతో పాటు వైద్యశిబిరం, నిర్వాహకులకు బహుమతుల ప్రదానం ఉంటుంది.

వివిధ శాఖల అధికారులతో సమన్వయం

స్కూళ్లు, కాలేజీల్లో

అవగాహన సదస్సులు

ప్రమాదాల నివారణకు సూచనలు

ఈ నెల 31 వరకూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు

రవాణా శాఖ ఆధ్వర్యంలో

పలు కార్యక్రమాలు

ప్రమాదాల నివారణే లక్ష్యం

ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రతి రోజూ షెడ్యూల్‌ రూపొందించి అన్ని వర్గాల వారినీ సమన్వయం చేసుకుంటు జిల్లా వ్యాప్తంగా నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. జిల్లాలో వాహనాలు నడిపే వారి భద్రతే ధ్యేయంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్నాం. పెద్దాపురం, కత్తిపూడి యూనిట్ల అధికారులకు షెడ్యూల్‌ కేటాయించాం. – కె.శ్రీధర్‌, జిల్లా రవాణాశాఖాధికారి, కాకినాడ

రోడ్డు భద్రతపై ఫోకస్‌1
1/2

రోడ్డు భద్రతపై ఫోకస్‌

రోడ్డు భద్రతపై ఫోకస్‌2
2/2

రోడ్డు భద్రతపై ఫోకస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement