
గట్టు తెగితే గల్లంతే..
ఐ.పోలవరం: ఒకవైపు గౌతమి గోదావరి పాయ... మరోవైపు వృద్ధ గౌతమి నదీ పాయ...ఈ రెండింటి మధ్య ఉండే దీవి ఐ.పోలవరం (ఐలాండ్). సుమారు 16 గ్రామాలతో ఉండే ఐలాండ్‌లో దాదాపు లక్ష మంది వరకూ ప్రజలు జీవిస్తున్నారు. గోదావరి మధ్యన ఉండే ఈ దీవికి వరద సమయంలో చుట్టూ ఉన్న ఏటిగట్లే శ్రీరామరక్ష. 2006, 2022లో గోదావరికి వచ్చిన అతి పెద్ద వరదల నుంచి ఇవే ఐలాండ్‌ను రక్షించాయి. అటువంటి ఏటిగట్లకు గత కొన్నేళ్లుగా కనీస మరమ్మతులు చేపట్టలేదు. దీంతో అవి కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి.
వరద పోటు
గోదావరికి వరద పోటు తాకగానే ఏటిగట్లను ఆనుకుని ఉండే నది లంక గర్భాలు నీట మునుగుతుంటాయి. ఏటిగట్టు పట్టున ఉండే పంట పొలాలు, ఇళ్లల్లోకి వరద నీరు చేరడం ఇక్కడ సర్వసాధారణం. అయితే ఏటిగట్ల వల్ల వరద నీరు గ్రామాల్లోకి రాకుండా ఉంటుంది. ఐలాండ్ చూట్టూ 36 కిలోమీటర్ల మేర ఏటిగట్లు విస్తరించి ఉన్నాయి. వీటిని 2000లో ఎత్తు చేసి పటిష్ట పరిచారు. నాటి నుంచి నేటి వరకు కనీస మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడవి బలహీనపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుంగిపోయి..
ఐ.పోలవరం మండలంలోని పలు గ్రామాలలో ఏటిగట్లు కుంగి స్థానికులను భయపెడుతున్నాయి. గట్లకు రక్షణగా ఉన్న మట్టి అండలుగా జారిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో కోతలకు గురై ప్రమాదకరంగా మారాయి. గట్ల మీద వేసిన గ్రావెల్, బీటీ రోడ్లు అధ్వానంగా తయారై, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మండలంలోని కేశనకుర్రు, కేశనకుర్రుపాలెం, తిల్లకుప్ప, దుప్పిలంక, జి.మూలపాలెం, జి.వేమవరంలో ఐలాండ్ ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయి. ఇటువంటిచోట మరమ్మతులు చేపట్టి, గట్లకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
కొంపముంచుతున్న ఆక్వా సాగు
ఏటిగట్లను ఆనుకుని నదీ గర్భంలో ఆక్వా సాగు చేపట్టారు. దీని కోసం ఏటిగట్టు వెంబడి ఇస్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నదీ గర్భంలోనే ఆక్వా చెరువులు ఉన్నాయి. గట్లకు ఆనుకుని నదిలో ఉండే పెద్ద పెద్ద మట్టి దిబ్బలను తొలగించడం వల్ల వరద నీటి ప్రవాహం నేరుగా గట్టుకు తగులుతోంది. దీని వల్ల గండ్లు పడే ప్రమాదం మరింత పెరుగుతోంది. ఆక్వా చెరువుల తవ్వకాలు 1856 మద్రాస్ కన్జర్వెన్సీ యాక్టుకు పూర్తి విరుద్ధం. నది వైపునే కాకుండా నదికి ఇవతలి వైపు ఐలాండ్‌లో సాగు చేసే ఆక్వా చెరువుల కోసం గట్లను ధ్వంసం చేసి, మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల వీటి వల్ల కూడా గట్లు బలహీనపడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో కొమరగిరి, పాత ఇంజరం, ఎదుర్లంక, జి.వేమవరం, మురమళ్ల, పశువుల్లంక, కేశనకుర్రు. జి.మూలపొలంలో ఆక్వా సాగు పెద్ద ఎత్తున సాగుతోంది. ఇంత జరుగుతున్నా హెడ్ వర్‌ుక్స అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
దెబ్బతిన్న ఐలాండ్ రోడ్లు
గతంలో ఐలాండ్ చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టారు. పలుచోట్ల బీటీ రోడ్లు వేశారు. మొత్తం బీటీ రోడ్డు వేసి ఉంటే వాహనాల రాకపోకలు పెరిగి గట్లు బలపడడంతో పాటు స్థానికులకు రవాణా సౌకర్యం కూడా ఏర్పడుతుందని భావించారు. దీనితో పాటు నదిని ఆనుకుని రిసార్టుల నిర్మాణాలు జరిగితే పర్యాటకాభివృద్ధి జరుగుతుందని ప్రణాళికలు రచించారు. ఆ తర్వాత వాటి సంగతి వదిలేశారు. ప్రస్తుతం ఏటిగట్ల మీద రహదారులు దెబ్బతినడంతో రైతులు, స్థానికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. గోదావరికి వరదలు సమీపిస్తున్న తరుణంలో గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు గట్లను పటిష్టం చేసే పనులు చేపట్టాలని ఐలాండ్ వాసులు కోరుతున్నారు.
బలహీనంగా ఏటిగట్లు
వరదలు వచ్చే సమయం
స్థానికుల ఆందోళన
రక్షణ చర్యలు చేపట్టాలి
IÌê…yŠæ HsìæVýSrϯ]l$ 2000ÌZ ç³sìæçÙt ç³Ç^éÆý‡$. B 糯]l$Ë$ fÇW Cç³µ-sìæMìS §é§éç³# 24 Hâ¶æ$Ï AÐ]l#-™ø…-¨. M>ºsìæt Hsìæ-VýS-rϯ]l$ çÜÐ]l${VýS…V> ç³Ç-Ö-Í…-_, MýS$…W¯]l {´ë…™é-ÌS¯]l$ VýS$Ç¢…_ Ððl…r¯ól ç³sìæçÙt 糯]l$Ë$ ^ólç³-sêtÍ. Ð]l$Æø ¯ðlÌS ÆøkÌZÏ Vø§éÐ]lÇ Ð]lÆý‡-§ýlÌSMýS$ Ð]l^óla AÐ]lM>Ôèæ… E¯]l²…§ýl$¯]l Ððl…r¯ól 糯]l$Ë$ {´ëÆý‡…-À…-^é-Í. ˘
– ఎన్.రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ,
టి.కొత్తపల్లి, ఐ.పోలవరం మండలం

గట్టు తెగితే గల్లంతే..