ఎర్రవల్లి: బాలల హక్కుల పరిరక్షణలో బాలల పరిరక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారిణి సునంధ అన్నారు. మంగళవారం ఇటిక్యాల మండల మహి ళా సమాఖ్య భవనంలో నిర్వహించిన మండలస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి బాలబాలిక సంతోషంగా, ఆరో గ్యంగా విద్యలో రాణించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం అందరి బాధ్యత అని అన్నారు. సమాజంలో కుటుంబం, పాఠశాల, పని ప్రదేశం, గ్రామ పరిసరాలు వంటి అనేక స్థాయిల్లో బాలలపై పలు ఘటనలు ఉత్పన్నమవుతున్నాయ ని తెలిపారు. వాటి నివారణకు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు బలమైన సమన్వయ వ్యవస్థ అవసరమన్నారు. బాల్యవివాహాలు, బాల కార్మికత్వం, పాఠశాల మానివేత, బాలలపై హింస, బాలల నిర్లక్ష్యం, బాలల అక్రమ రవాణా, లైంగిక దాడులు, వీధి బాలల సమస్యలు, అనాథ పిల్లల సంరక్షణ వంటి అంశాలు తక్షణ స్పందనకు అవసరమయ్యే అంశాలని పేర్కొన్నారు. అనంతరం వివి ధ శాఖల అధికారులతో కలిసి ఆమె బాలల పరిరక్షణ కమిటీ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ హేమలత, జిల్లా బాలల ప రిరక్షణ అధికారి నర్సింహులు, తహసీల్దార్ సాయికిరణ్‌రెడ్డి, ఎంపీడీఓ రమాదేవి పాల్గొన్నారు.


