మాకు విఠలాపురం గ్రామశివారులోని సర్వేనం.180లో రెండున్నర ఎకరాల పొలం ఉంది. అ యితే నెట్టెంపాడు కాల్వ కోసం భూమిని తీసుకున్న అధికారులు.. పనులు చేయకుండా బాటను పూర్తిగా బంద్ పెట్టారు. దీంతో మాపొలానికి వెళ్లాలంటే చాలా కష్టాలు పడుతున్నాం. పొలంలో పంట వేసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. దీనిపై అధికారులను అడిగే బాట వేయడానికి ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదంటూ సమాధానం ఇస్తున్నారు. మా ఇబ్బందిని తొలగించండి.
– లక్ష్మి, గోవిందమ్మ, పార్శచర్ల, ధరూరు మండలం


