నాకు 4ఎకరాల పొలం ఉంది. సుమారు 30ఏళ్ల క్రితం మా పెద్దలు కొనుగోలు చేశారు. బోరుబావి సాయంతో పంటలు పండించుకుంటూ జీవనం చేస్తున్నాం. అయితే మాపై ఇతరులు అక్రమంగా కేసు పెట్టి వేధింపులకు గురిచేశారు. దీనిపై కోర్టును ఆశ్రయించగా.. గతేడాది మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే నాలుగు రోజుల క్రితం నా పొలాన్ని అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు. దీనిపై అధికారులను అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలి.
– గోపాల్‌నాయక్, ఆలూరు, గట్టు మండలం


