బడి మానేస్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

బడి మానేస్తున్నారు..

Jul 7 2026 12:50 AM | Updated on Jul 7 2026 12:50 AM

పునరావాస కేంద్రంలో పాఠశాల భవనం అసంపూర్తిగా ఉంది. బడిలో కనీసం కూ ర్చునేందుకు గదులు కూడా లేవు. స్లాబ్‌ వేసి వదిలేశారు. అసంపూర్తి భవనంలో బడిని కొనసాగిస్తుండటంతో పిల్లలు వెళ్లడం లేదు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. – కుర్వ నర్సింహులు, చిన్నోనిపల్లె

రోడ్డును పూర్తిచేయాలి..

పునరావాస కేంద్రం నుంచి ఉన్న లింకు రోడ్లను పూర్తిచేయాలి. రోడ్డు నిర్మాణం పూర్తయితే మారుమూల ఉన్న లింగాపురం, అంతంపల్లి, చిన్నోనిపల్లె నుంచి బోయలగూడెంతో పాటు కర్ణాటక ప్రాంతానికి రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. బోయలగూడెం గ్రామస్తులు బల్గెర మీదుగా కాకుండా చిన్నోనిపల్లె పునరావాస కేంద్రం మీదుగా అయిజకు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. – రామచంద్రగౌడ్‌, చిన్నోనిపల్లె

పరిష్కారానికి

చర్యలు..

చిన్నోనిపల్లె పునరావాస కేంద్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. పాఠశాల భవనం, రోడ్డు పనులు పూర్తిచేసే విధంగా చర్యలు చేపడుతాం. అన్ని శాఖల సమన్వయంతో పునరావాస కేంద్రంలోని సమస్యలను పరిష్కరిస్తాం.

– శ్రీనివాసరావు,

ఆర్డీఓ, గద్వాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement