గతేడాది మంజూరు కాలేదు.. | - | Sakshi
Sakshi News home page

గతేడాది మంజూరు కాలేదు..

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

గతేడాది మంజూరు కాలేదు.. అధిక దిగుబడులు.. దరఖాస్తు చేసుకోవాలి..

నాకున్న మూడు ఎకరా ల్లో క్యాలిఫ్లవర్‌, కాకర, క్యాప్సికం తదితర కూరగాయలు పండిస్తాను. అ యితే గతేడాది సబ్సిడీపై పందిళ్ల ఏర్పాటుకోసం ప్రయత్నించా. యూనిట్లు తక్కువగా ఉండటంతో మంజూరు కాలేదు. ఈ ఏడాది ఎక్కు వ యూనిట్లు రావడం సంతోషంగా ఉంది.

– సుదర్శన్‌రెడ్డి, ఉద్యాన రైతు, గద్వాల

పందిళ్ల పద్ధతిన తీగజాతి కూరగాయలు పండించడం ద్వారా అధిక దిగుబడులు వస్తాయి. చీడపీడల బెడద ఎక్కువగా ఉండదు. ఆర్‌కేవీవై పథ కం కింద సబ్సిడీపై పందిళ్లు ఏర్పాటు చేసుకునేందుకు చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారు.

– మనోహర్‌, ఉద్యాన రైతు, షాబాద్‌,

ఇటిక్యాల మండలం

తీగజాతి కూరగాయలను ఆధునిక విధానంలో పండించేందుకు పందిళ్ల పద్ధతి చాలా మంచింది. ఈ పద్ధతిన నాణ్యమైన ఉత్పత్తులతో పాటు అధిక దిగుబడులు వస్తాయి. ఆసక్తి గల రైతులు దరఖాస్తులు చేసుకో వాలని ఇప్పటికే సూచించాం. దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన రైతులకు 50శాతం సబ్సిడీపై పందిళ్లు ఏర్పాటుచేస్తాం.

– రాజ్‌కుమార్‌,

జిల్లా ఉద్యానశాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement