ఉద్యాన రైతుకు ఊరట | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన రైతుకు ఊరట

Jul 6 2026 12:28 AM | Updated on Jul 6 2026 12:28 AM

–8లో u

గద్వాల వ్యవసాయం: జిల్లాలో ఉద్యాన రైతులకు కా సింత ఊరట లభించింది. తీగజాతి కూరగాయల సాగులో భాగంగా ఏర్పాటు చేసుకునే పందిళ్లకు 2026–27 ఆర్థిక సంవత్సరం రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై ) కింద రూ. 90లక్షలు (180 యూనిట్లు) మంజూరయ్యాయి. అదే విధంగా క్షేత్రస్థాయిలో రైతుల విజ్ఞాన యాత్రలు, నూతన పద్ధతులపై శిక్షణకు రూ. 50వేలు కేటాయించారు. గతేడా దితో పోల్చితే ఈ ఏడాది కూరగాయల పందిళ్లకు అధికంగా నిధులు విడుదలయ్యాయి.

నాణ్యమైన దిగుబడులు..

తీగజాతి కూరగాయలైన సోర, బీరకాయ, కాకర, పొట్లకాయలను పందిళ్ల పద్ధతిలో పండించడం ద్వారా నాణ్యమైన దిగుబడులు వస్తాయి. కాయలు నేలను తాకకుండా ఉండటం వల్ల వాటికి మంచి ఆకారం, ఆకర్షణీయమైన రంగు వచ్చి.. మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. పందిరి విధానంలో గాలి, వెలుతురు తగలడం వల్ల పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం తక్కువే. తీగలు పైకి ఎగబాకడం ద్వా రా ఎక్కువ పూత, పిందెలు వచ్చి.. సాధారణ దిగుబడి కంటే 30 నుంచి 40 శాతం ఎక్కువ దిగుబడి వస్తుంది. పందరిపై కాయలు స్పష్టంగా కన్పించడం ద్వారా నాణ్యత దెబ్బతినకుండా కోయవచ్చు. పందిరి కింద ఉన్న ఖాళీ స్థలంలో ఆకుకూరలను అంతర్‌ పంటగా వేయవచ్చు. ఇలా పందిళ్లతో పలు ప్రయోజనాలు ఉన్నాయి.

తగ్గనున్న ఆర్థికభారం..

ఉద్యాన పంటల సాగుపై ఇక్కడి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.ప్రధానంగా కూరగాయల సా గులో నూతన పద్ధతులు తెలిసినప్పటికీ ఆర్థిక పరమైన కారణాల వల్ల అనుసరించడం లేదు. చాలా మంది రైతులు తీగజాతి కూరగాయలను సైతం నేలపైనే పండిస్తున్నారు. పందిళ్లు వేయాలంటే అరెకరాకు రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉండటంతో ఆ మేరకు పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు. ఆర్‌కేవీవై పథకం కింద పందిళ్ల ఏర్పాటు కోసం నిధులు మంజూరు కావడం ఉద్యాన రైతులకు కాసింత ఊరటనిస్తుందని చెప్పవచ్చు.

రాయితీపై కూరగాయల పందిళ్లు

జిల్లాకు 180 యూనిట్లు మంజూరు

దరఖాస్తులు ఆహ్వానించిన ఉద్యానశాఖ

సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement