జోగుళాంబదేవికి బంగారుపూత చీర | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబదేవికి బంగారుపూత చీర

Jul 5 2026 2:30 AM | Updated on Jul 5 2026 2:30 AM

అలంపూర్‌ రూరల్‌: హైదరాబాద్‌ నగరానికి చెందిన తీగల క్రాంతికుమార్‌రెడ్డి జోగుళాంబ అమ్మవారికి బంగారు పూత చీర విరాళంగా సమర్పించినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి దీప్తిరెడ్డి తెలిపారు. జోగుళాంబ అమ్మవారికి రాగిలోహంపై బంగారు పూతతో కూడిన 13 భాగాలు గల చీర (కవచం)ను విరాళంగా ఇచ్చారని, దీని విలువ సుమారు రూ.9,27,000 ఉంటుందని పేర్కొన్నారు. దాత కోరిన రోజు ఈ చీరను అమ్మవారికి అలంకరిస్తామని చెప్పారు. అలాగే శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీస్వామి జోగుళాంబ అమ్మవారికి శ్రీ చక్ర అభిషేకం నిమిత్తం 817 గ్రాముల బరువు గల వెండి కమండలం, అభిషేక పాత్రలను బహూకరించారని ఈఓ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement