దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

గద్వాల: క్రైస్తవ మైనారిటీ ఆర్థిక సంస్థ ద్వారా అర్హులైన క్రైస్తవుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ మహిళాశక్తి పథకం (కుట్టు మిషన్‌), ఆర్థిక సహాయం పథకం(చిన్న వ్యా పారాన్ని ప్రారంభించడానికి రూ.50 వేలు), డ్రైవర్‌ సాధికారత (ఈ–బైక్‌, ఈ–స్కూటీ, పెట్రోల్‌ బైక్‌, స్కూటీలు ఒక్కొక్కటి రూ.1.50 లక్షలు) కోసం ఆన్‌లైన్‌ http.tso bmms.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌..

రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర మైనారిటీ స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి అక్బర్‌పాషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 18 వరకు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుట్టుమిషన్‌ చిరు వ్యాపారులు 21–55 ఏళ్లలోపు వారు, ఈ–బైక్‌, ఈ–స్కూటీ, మోటార్‌ బైక్‌ కోసం వయసు 21–50 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు ఉండాలని చెప్పారు.

గడువు పొడిగింపు

గద్వాల: జిల్లాలోని విద్యార్థులకు 2026–27, 28 సంవత్సరాలకు గాను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌, ఐటీఐ ఎన్‌సీవీటీ ప్యాట్రన్‌ కింద ఇంజినీరింగ్‌ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తు తేదీని ఈ నెల 10 వరకు పొడిగించినట్లు ఐటీఐ ప్రిన్సిపల్‌ జిల్లా కన్వీనర్‌ విశ్వపాలకరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1.5.2026 నాటికి 14 ఏళ్లు నిండి 8 లేదా 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు కొన్ని కోర్సులకు మాత్రమే అర్హులన్నారు. అడ్మిషన్‌ కోసం విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా ప్రత్యేక మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, ఆధార్‌కార్డు కలిగి ఉండాలన్నారు. ట్రైనింగ్‌ వెరిఫికేషన్‌ కోసం ట్రెయినీలు రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ మాత్రమే వినియోగించాలన్నారు. ఆసక్తి గలవారు http.iti.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నం.85004 64782లను సంప్రదించాలని సూచించారు.

హుండీ ఆదాయం రూ.20.29 లక్షలు

గద్వాల న్యూటౌన్‌: నడిగడ్డ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ అమ్మవారి ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు.దేవాదాయ శాఖ డివిజన్‌ పరిశీలకులు వెంకటేశ్వరి, ఆల య ఈ ఓ పురంధర్‌కుమార్‌ పర్యవేక్షణలో యూనియ న్‌ బ్యాంకు సిబ్బంది,ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో మూడు నెలల హుండీని లెక్కించగా.. రూ.20.29 లక్షల ఆదాయం సమకూరింది.హుండీ లెక్కింపులో నగదు మాత్రమే ఉందని, వెండి, బంగారు రాలేదని ఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement