యూనివర్సిటీకే రావాలి.. | - | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీకే రావాలి..

Jun 20 2026 10:44 AM | Updated on Jun 20 2026 10:44 AM

యూనివర్సిటీకే రావాలి.. పునరాలోచించాలి..

యూనివర్సిటీలో జాతీయ స్థాయి సెమినార్‌ నిర్వహిస్తున్నామని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారని అధికారులు మొదట తెలిపారు. దీంతో సీఎం సొంత జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి వస్తే.. ఇక్కడ సమస్యలను పరిశీలించి నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ, సెమినార్‌ను హైదరాబాద్‌ శివారుకు మార్చడం బాధాకరం. సీఎం యూనివర్సిటీకే రావాలి.. ఇక్కడే సెమినార్‌ నిర్వహించాలి. అధిక నిధులు యూనివర్సిటీకి కేటాయించాలి.

– తాయప్ప,

బీసీ సంఘం పీయూ అధ్యక్షుడు

గతంలో ప్రభుత్వాలు యూనివర్సిటీని పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీయూ నిర్వహించే నేషనల్‌ సెమినార్‌ను హైదరాబాద్‌ శివారుకు మార్చడంలో అధికారుల ఉద్దేశం ఏమిటి. ఇక్కడే సెమినార్‌ నిర్వహిస్తే యూనివర్సిటీకి సొంత జిల్లాలో సీఎం ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు వేదిక మార్పుపై పునరాలోచించాలి.

– రవికిషోర్‌, పీయూ ఏబీవీపీ సెక్రెటరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement