163 సెక్షన్‌ అమలు: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

163 సెక్షన్‌ అమలు: ఎస్పీ

Jun 20 2026 10:44 AM | Updated on Jun 20 2026 10:44 AM

గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగే నీట్‌ నేపథ్యంలో 163 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని నాలుగు కేంద్రాల్లో నీట్‌ కొనసాగుతుందని.. పరీక్ష ముగిసే వరకు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్‌నెట్‌, జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచాలన్నారు. గుంపులు గుంపులుగా ఎవరైనా తిరిగితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

పల్లీ క్వింటా రూ.7,659

గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శుక్రవారం 1,448 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,659, కనిష్టంగా రూ. 2,449, సరాసరి రూ. 6,399 ధరలుపలికాయి.

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటాల్‌ గరిష్టంగా రూ.2,708, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటాకు గరిష్టంగా రూ.2086, కనిష్టంగా రూ.1,710 చొప్పున పలికాయి.

టెట్‌ నుంచి

మినహాయింపు ఇవ్వాలి

గద్వాలన్యూటౌన్‌: 2010 ఆగస్టు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి శాశ్వత మినహాయింపుతో సేవా రక్షణ కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి గౌరిశెట్టి నాగరాజు కోరారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్‌ వర్తింపజేయడంతో దశాబ్దాలుగా సేవ చేస్తున్న లక్షలాది ఉపాధ్యాయుల భవిష్యత్‌ అభద్రతలో పడిందన్నారు. 2010 కంటే ముందు చేరిన ఉపా ధ్యాయులందరికీ టెట్‌ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వడంతో పాటు సర్వీస్‌ సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ మేరకు పార్లమెంట్‌ ద్వారా చట్ట సవరణ చేసి.. రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో తపస్‌ నాయకులు మోహన్‌రెడ్డి, ఆంజనేయులు, రాఘవేంద్ర, శంకర్‌, మహేందర్‌, మల్లిఖార్జున్‌, శివప్రసాద్‌, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement