మార్పుతోనే మనుగడ..
● ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల: జిల్లాకేంద్రంలోని దౌదర్‌పల్లి శివారులో పేదలకు అందించిన డబుల్‌బెడ్రూం ఇళ్లను ఇతరులకు అద్దెకిస్తే కేటాయింపు రద్దు చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. గురువారం జిల్లాకేంద్రం శివారులో రూ. 5.7కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళాశక్తి భవనంతో పాటు పక్కనే కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం డబుల్‌బెడ్రూం ఇళ్లను సందర్శించి లబ్ధిదారుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డబుల్‌బెడ్రూం ఇళ్లలో లబ్ధిదారులే నివాసం ఉండాలని.. ఇతరులకు అద్దెకు ఇవ్వరాదని తెలిపారు. ఎవరైనా అద్దెకు ఇస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, 2026–27 విద్యా సంవత్సరంలోనే కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందిరా మహిళాశక్తి భవనాన్ని సైతం నిర్దేశిత సమయంలోగా పూర్తిచేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కళాశాల భవనాలను ఆయన కలియతిరిగారు. మెడిసిన్ విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. కళాశాలలో విద్యార్థులు, సిబ్బంది హాజరు నివేదికను ఎప్పటికప్పుడు నివేదించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. అనంతరం క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ ప్రభాకర్, డీఈ లక్ష్మన్న, డీఈఓ విజయలక్ష్మి, మెడికల్ కాలేజీ వైస్‌ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర, తహసీల్దార్ హరికృష్ణ త దితరులు ఉన్నారు.
గద్వాల క్రైం: ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి ప్రా రంభించారు. ఎయిడ్స్ మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్య అంశాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రజల్లో మార్పుతోనే మనుగడ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ సంధ్యా కిరణ్మయి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇందిర, డా.రాజు పాల్గొన్నారు.


