
శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దు
గట్టు: శాంతిభద్రతలకు భంగం కల్గించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ మొగిలయ్య హెచ్చరించారు. గురువారం ఆలూరు, గట్టు గ్రామాల్లోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆయనతోపాటు గట్టు ఎస్‌ఐ మల్లేష్ సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాలకు జనాలు 100 మీటర్ల దూరం ఉండాలని, అభ్యర్థితో పాటుగా ఇద్దరికి మాత్రమే కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని, మోబైల్‌పోన్లు, వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు.