
నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ మేరకు ఈ నెల 9నుంచి 11వ తేదీ వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసినట్లు వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, లా అండ్ ఆర్డర్ నిర్వహణ తదితర అంశాలను తెలియజేశారు. వీసీలో ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారా యణ, నర్సింగ్‌రావు, డీపీఓ నాగేంద్రం, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్‌కుమార్‌రెడ్డి, ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.