
ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం..
నెట్టెంపాడు ఎత్తిపోతల నుంచి పంట పొలాలకు సాగునీరు వస్తుందని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం. పంటపొలాల్లో కాల్వలు తవ్వి అసంపూర్తిగా వదిలేశారు. ముచ్చోనిపల్లి రిజర్వాయర్‌లో నీళ్లు ఉన్నా లాభం లేకుండా పోయింది. కాల్వలు తవ్వకుండా ఉన్నా ఆ స్థలంలో పంటలు పండించుకునే వాళ్లం.
– బజారి, రైతు, తూంకుంట
పంట పొలాల్లో కాల్వలు పోయిన రైతులతో పాటు చుట్టుపక్కల పంట పొలాలు ఉన్న రైతులు డీజిల్ ఇంజిన్లతో పైరుకు నీరు కడుతున్నారు. కాల్వలకు దూరంగా పంట పొలాలు ఉన్నవారి పరిస్థితి దయనీయంగా మారింది. వచ్చే ఏడాది వర్షాకాలం నాటికై నా కాల్వల పనులు పూర్తిచేసి సాగునీటిని విడుదల చేయాలి.
– దేవేంద్ర, రైతు, ఎక్లాస్‌పురం
కాల్వ పనులు పూర్తిచేసేందుకు కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. భూ సేకరణకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. చిన్న కాల్వలు తవ్వేందుకు కొందరు రైతులు అభ్యంతరం తెలుపుతున్నారు. కొంతమంది రైతుల నుంచి భూ సేకరణ చేయాల్సి ఉంది. ఆయా సమస్యలను పరిష్కరించి కాల్వల పనులు పూర్తిచేసేందుకు కృషిచేస్తాం.
– నవీన,
నెట్టెంపాడు లిఫ్ట్ 109వ ప్యాకేజీ డీఈఈ
●

ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం..