అనుమతుల చర్యలు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

అనుమతుల చర్యలు వేగవంతం

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

భూపాలపల్లి: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, కాలు వల నిర్మాణానికి సేకరించిన భూముల యజమానులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించడం, అటవీ శాఖ సంబంధిత అనుమతుల చర్యలు వేగవంతం చేశామని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) అశోక్‌కుమార్‌ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్‌తో కలిసి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ నుంచి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, భూ సేకరణ, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.

పర్యాటకంగా తీర్చిదిద్దుతాం..

తెలంగాణను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు, 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్‌ డా లర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడంలో పర్యాటక రంగాన్ని కీలక భాగస్వామిగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. మంగళవారం హైదరా బాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం నుంచి పర్యాటక ప్రాంతాలు గుర్తింపు, విజన్‌ 2047 కార్యాచరణ అమలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, పర్యాటక అధికారి రఘు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement