మహాముత్తారం మండలం మారుమూల ప్రాంతమైన కనుకునూర్ గ్రామానికి భూపాలపల్లి డిపో ఆర్టీసీ బస్సు ఉదయం, సాయంత్రం మాత్రమే నడుపుతున్నారు. మధ్యాహ్నం ప్రయాణం చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. విధిలేని పరిస్థితిలో కొంతమంది మండలకేంద్రానికి రావాలంటే 15కిలోమీటర్లు కాలినడకన పెగడపల్లికి వస్తున్నారు. అక్కడ నుంచి ప్రైవేట్ వాహనాల్లో మండలకేంద్రానికి చేరుకుంటున్నారు. గురువారం కాటారం మండలకేంద్రానికి వివిధ పనుల మీద వచ్చిన గ్రామస్తులు తిరుగు ప్రయాణంలో బస్సు లేకపోవడంతో ఓ ప్రైవేట్ వాహనంలో పైన వెనుక బాగంలో నిల్చొని ప్రయాణం చేశారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు.
– మహాముత్తారం


