రేగొండ: ఒకప్పుడు వి ద్యార్థులతో కళకళలాడిన పాఠశాల విద్యార్థుల కొరతతో మూతపడింది. రెండేళ్ల తర్వాత పాలకవర్గం, గ్రామస్తుల చొరవతో మళ్లీ తెరుచుకుంది. కొత్తపల్లిగోరి మండలంలోని రామగుండాలపల్లికి చెందిన గ్రామస్తులు తమ పిల్లలను 14 మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. దీంతో పాఠశాలను జిల్లా విద్యాఽశాఖాధికారి రాజేందర్, సర్పంచ్ ఏడెల్లి మోహన్‌రెడ్డి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతోనే మూసివేసిన పాఠశాలను మళ్లీ ప్రారంభించడం సాధ్యమైందన్నారు. అనంతరం దాతలు అందజేసిన బ్యాగులు, నోట్ బుక్స్, వాటర్ బాటిల్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు.


