కాళేశ్వరం: శని త్రయోదశి, మాసశివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో నవగ్రహాల వద్ద శని, శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలను శనివారం భక్తులు అధికంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలో బారులుదీరారు. దీంతో నవగ్రహ, కాలసర్ప పూజలు చేసిన భక్తులు స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. నవగ్రహ పూజలు 435, కాలసర్పదోష పూజలు 175, స్వామివారి గర్భగుడిలో అభిషేకాలు 126, ఇతర పూజలు, ప్రసాదాలపై రూ. 4,59,200 ఆదాయం సమకూరిందని ఆలయవర్గాలు తెలిపాయి. దీంతో గోదావరి తీరం, ఆలయంలో భక్తులు కిక్కిరిశారు.


