మల్హర్(కాటారం): అడవుల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని కాళేశ్వరం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కాటారం అటవీ రేంజ్ పరిధిలో ప్లాంటేషన్ పనులను సీసీఎఫ్ పరిశీలించారు. మొక్కల నాణ్యత, పెంపక విధానాలను నిశితంగా పరిశీలించారు. రాబోయే ప్లాంటేషన్‌లో నాటబోయే మొక్కల రకాలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం దామెరకుంట బీట్‌ను సందర్శించి కంపార్ట్‌మెంట్ నంబర్ 154లోని 10 హెక్టార్లలో ఏర్పాటుచేసిన ఎస్‌ఎంఎస్ ప్లాటేషన్‌ను పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, మహదేవపూర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సందీప్, కాటారం ఎఫ్‌ఆర్‌ఓ స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు.
సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్


