భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, బొగ్గు పరిశ్రమల రక్షణ కోసం బీఎంఎస్ రాజీలేని పోరాటాలు చేస్తోందని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–8వ గనిలో శుక్రవారం నూతనంగా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా ‘బీఎంఎస్ కార్మిక భరోసా’ పేరుతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధి విషయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేటీకే–8వ గని ఫిట్ కార్యదర్శి అడపా రాజు, బీఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వెలబోయిన సుజేందర్, నాయకులు మల్లేష్ శంకర్, నారాయణ, శీలం రాజు, మల్లేష్, శ్రవణ్, కనకయ్య, ప్రవీణ్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్


