భారం అధికం | - | Sakshi
Sakshi News home page

భారం అధికం

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

జిల్లా రైతులపై..

వానాకాలం సాగు (ఎకరాల్లో..)

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు

(బస్తాకు రూ.లలో..)

పంటల వారీగా కొత్త ఎంఎస్పీ

(క్వింటాలుకు రూ.లలో..)

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెంచిన కేంద్రం

మద్దతు

కొంచెం..

భూపాలపల్లి రూరల్‌: వానాకాలం సీజన్‌కు ముందే జిల్లాలోని రైతు నెత్తిన పిడుగుపడింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రైతులు యాసంగి పంట అమ్ముకోవడానికి తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే కేంద్రం కాస్త ఊరటనిచ్చేలా 14 పంటలకు కనీస మద్దతుధర పెంచింది. ఈ పెంపు చాలా తక్కువగా ఉండడంతో చాలామంది రైతులు పెదవి విరిచారు. తాజాగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను 50 కేజీల బస్తాకు రూ.150 నుంచి రూ.400 వరకు పెంచేసింది. మద్దతు ధర పెంపు క్వింటాలుకు రూ.72 నుంచి రూ.622 మాత్రమే. ఎకరాకు లెక్కేస్తే రైతుకు వచ్చే అదనపు ఆదాయం కన్నా ఎరువులకే అయ్యే అదనపు ఖర్చు రెట్టింపు అవుతోంది.

రూ.కోట్లలో అదనపు భారం

జిల్లా వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఈ సీజన్‌లో రైతులపై అదనంగా రూ.కోట్లలో ఎరువుల భారం పడుతుంది. ఎంఎస్‌పీ పెంపుతో వచ్చే అదనపు ఆదాయం పెరిగినప్పటికీ డీజిల్‌ లీటరు రూ.3, కూలీ రోజుకు రూ.100 పెరగడంతో ఆ మిగులు కూడా కరిగిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి క్వింటాలుకు రూ.72 పెంచి ఎరువు బస్తాకు రూ.400 పెంచితే ఎలా బతకాలి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట చేతికి వచ్చాక తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 3–4 కేజీలు కోత పెడుతున్నారని పేర్కొంటున్నారు.

● వరి సాగుచేసే రైతులు సాధారణంగా ఎకరాకు 10:26:26 రెండు బస్తాలు, యూరియా రెండు బస్తాలు వాడతారు. 10:26:26పై బస్తాకు రూ.300 చొప్పున రూ.600 పెరిగింది.

● పత్తి సాగుచేసే రైతులు ఎకరాకు 12:32:16 రెండు బస్తాలు, 20:20:0:13 ఒక బస్తా, యూరియా రెండు బస్తాలు వాడతారు. 12:32:16పై బస్తాకు రూ.400 చొప్పున రూ.800 భారం పడుతుంది. 20:20:0:13పై రూ.150 కలిపి మొత్తం రూ.950 భారం పడుతుంది.

● మొక్కజొన్న సాగుచేసే రైతులు సాధారణంగా 14:35:14 ఒక బస్తా. యూరియా రెండు బస్తాలు వాడుతారు. వీరిపై రూ.350 అదనపు భారం పడుతుంది.

● సోయాబీన్‌ రైతులు పంటకు 12:32:16 ఒక బస్తా, డీఏపీ ఒక బస్తా వినియోగిస్తారు. 12:32:16పై రూ.400 పెరిగినందున ఆ భారం రైతుపై పడుతుంది.

వరి 1,09,054

పత్తి 1,06,560

మిర్చి 25,000

పెసర 110

బొబ్బెర 90

ఎరువు పాత ధర కొత్త ధర పెంపు

10:26:26 1850 1,975 125

12:32:16 1,475 1,875 400

14:35:14 1,500 1,850 350

20:20:0:13 1,500 1,800 300

డీఏపీ 1,350 1,350 మార్పులేదు

28:28:0 1,500 1,800 300

పొటాష్‌ 1,850 1,975 125

సూపర్‌ 615 775 160

పంట పాత ధర కొత్త ధర పెంపు

వరి(సాధారణ) 2,369 2,441 72

వరి(గ్రేడ్‌–ఏ) 2,389 2,461 72

మొక్కజొన్న 2,329 2,401 72

పత్తి(మధ్యశ్రేణి) 7,710 8,267 557

పత్తి(దీర్ఘశ్రేణి) 8,110 8,667 557

సోయాబీన్‌ 4,892 5,284 392

కంది 7,550 8,415 865

రూ.150నుంచి రూ.400 వరకు పెంపు

ఎంఎస్‌పీ పెంపు నామమాత్రమే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement