నేడు సింగరేణి పరిరక్షణ సదస్సు | - | Sakshi
Sakshi News home page

నేడు సింగరేణి పరిరక్షణ సదస్సు

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) భూపాలపల్లి ఏరియాలో సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. ఏరియాలోని కేటీకే 8వ గనిలో గురువారం నిర్వహించిన గేట్‌ మీటింగ్‌కు రాజిరెడ్డి హాజరై మాట్లాడారు. సదస్సును జయపద్రం చేయాలని కోరారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలతో కార్మికులను ఇబ్బందులు గురి చేస్తుంటే ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడితెల సమ్మయ్య, సదానందం, అవినాష్‌రెడ్డి, మధు, రాజేందర్‌, మూర్తి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రతీ గురువారం విచారణ

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో 18 ఏళ్లలోపు బాల నేరస్తులకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం అందించేందుకు తొలి సారి జిల్లాలో ఏర్పాటు చేసి జువైనైల్‌ జస్టిస్‌ బోర్డు ప్రతీ గురువారం కేసుల విచారణ నిర్వహించనున్నట్లు బోర్డు ప్రిన్సిపల్‌ మేజిస్ట్రేట్‌, న్యాయమూర్తి జి.అఖిల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన జిల్లా సెషన్స్‌ ఇన్‌చార్జ్‌ జడ్జి ఎస్‌వీపీ సూర్య చంద్రకళ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. బాలల కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement