మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం విఫలం
మొక్కజొన్న కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు విమర్శించారు.
ఓటీ..లూటీ
మేడారం జాతరలో విధులు నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులకు ఓవర్ టైమ్ (ఓటీ) విధులకు సరిగా చెల్లింపులు చేయకుండా అధి కారులు ఇబ్బందులు పెడుతున్నారు.
చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి విగ్రహాలకు మెరుగులు
కాళేశ్వరం: ప్రాచీన పుణ్యక్షేత్రమైన కాళేశ్వరాలయంలో చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి కళావైభవం మళ్లీ వెలుగులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా నిరాధారణకు గురై పక్కకు పడేసిన అపూర్వ శిల్పాలను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో గుర్తించారు. ఆ విగ్రహాలను భద్రపరిచేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. సుమారుగా క్రీస్తు శకం 540 నుంచి 1200 మధ్యకాలానికి చెందిన ఈ విగ్రహాలు ఆ కాలపు శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. 105 విగ్రహాలను ప్రస్తుతం పరిసరాల్లో గుర్తించి మెరుగులు దిద్దుతూ పునర్జీవం పోయనున్నారు.
ప్రభుత్వం దృష్టి..
కాళేశ్వరంలో నిరాధరణకు గురవుతున్న శిల్పకళను భవిష్యత్ తరాలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. దీంతో మ్యూజియం నిర్మాణానికి ప్రణాళికలు చేశారు. గతనెలలో రూ.1.20కోట్లతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. మే నెలలో సరస్వతీనది అంత్య పుష్కరాలు, వచ్చే ఏడాది జూన్‌లో గోదావరి పుష్కరాల సమయానికి అందుబాటులోకి రానుంది.
చాళుక్యులు, కాకతీయ ఽశిల్పకళా వైభవం..
కాళేశ్వరాలయం చాళుక్యులు, కాకతీయులు, ఇతర రాజవంశాల పాలనలో ఎంతో వైభవంగా నిర్మితమైందని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆలయ పరిసర ప్రాంతాల్లో విసిరివేయబడినట్లు ఉన్న ఈ పురాతన శిల్పాలు కాలక్రమేణా దెబ్బతిన్నా వాటి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్కియాలజీశాఖ ఈ విగ్రహాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రాథమిక పరిశీలనలు పూర్తిచేసి శిల్పాల ప్రాముఖ్యతను గుర్తించారు. వీటిని ప్రత్యేకమైన రసాయనాలతో శుభ్రపరచి, సంరక్షించి, మ్యూజియంలో అమర్చే దిశగా చర్యలు చేపడుతున్నారు.
శిల్పకళా వీక్షణకు అవకాశం..
చాళుక్యులు, కాకతీయుల కళా వైభవాన్ని భక్తులు, పర్యాటకులు మ్యూజియంలో ఒకే చోట ప్రత్యక్షంగా చూడగలుగుతారు. ఈ మ్యూజియం ప్రాంతీయ చరిత్రను వెలికితీసే కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇంకా పరిసరాల్లో చాలా వరకు పురాతన విగ్రహాలు ఆదరణకు నోచుకోలేదు. వాటిని కూడా గుర్తిస్తే భవిష్యత్ తరాలకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంది. మ్యూజియంలో విగ్రహం పేరు, ఏ కాలం నాటిది, స్టోన్, చరిత్ర వివరాలు పొందుపర్చనున్నారని తెలిసింది.
శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో (కాలుడు–యముడు) కొలువై ఉన్నారు. ఈ పరిసరాల్లో ఎక్కడ తవ్వినా పురాతన శిల్ప కళాసంపద బయటపడుతుందని గ్రామంలో చర్చ ఉంది. ప్రస్తుతం భిన్నమైన విగ్రహాలను కొన్నింటిని నిరాధరణకు గురిచేశారు. లైమ్ సాండ్ స్టోన్, బసల్ట్, బ్లాక్ స్టోన్‌లు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి 105 విగ్రహాలను గుర్తించారు. అందులో జయ, విజేయుడు, సూర్యుడు, యముడు, చిత్రగుప్తుడు, డుండి గణపతి, వేంకటేశ్వరస్వామి, బింధు మాధవ, నందులు, చతుర్ముఖ బ్రహ్మ శివలింగం, అహళ్య, సప్తరుషులు, సపక్త మాతృకలు, కృష్ణుడు, పరుషురాముడు, బలరాముడు, సూర్యచంద్రులు, అగ్నిస్తంభం, శివలింగాలు తదితర విగ్రహాలు మెరుగులు దిద్దుతూ పునర్జీవం పొందనున్నాయి.


