ఇసుక పంపిణీలో పారదర్శకత | - | Sakshi
Sakshi News home page

ఇసుక పంపిణీలో పారదర్శకత

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

ములుగు: జిల్లాలోని 10 మండలాల్లో గురువారం నుంచి ‘మన ఇసుక వాహనం‘ అమలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ములుగు కలెక్టర్‌ దివాకర టీఎస్‌ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్థానిక గృహ నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, ప్రభుత్వం ఇసుకను పారదర్శకంగా తక్కువ ధరకే అందిస్తోందని తెలిపారు. ఇసుక కావాల్సిన వారు టీఎస్‌ఎంఐవీ.సీజీజీ.జీఓవి.ఐఎన్‌ వెబ్‌సైట్‌ నుంచి వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

టీ–ఫైబర్‌ కేబుల్స్‌ రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు

జిల్లాలో జరిగే అభివృద్ధి పనుల కోసం జరిగే తవ్వకాల్లో భాగంగా టెలికాం, టీ ఫైబర్‌ కేబుల్స్‌ రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఐటీఎస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ భాస్కరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా టెలికాం కమిటీ సమావేశానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ధాన్యం కొనుగోలు

కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభం

యాసంగి (రబీ) 2025–26 సీజన్‌ కోసం కలెక్టరేట్‌లోని సివిల్‌ సప్లై కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కంట్రోల్‌ రూమ్‌ను గురువారం కలెక్టర్‌ దివాకర టీఎస్‌ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం, రవాణా, మద్దతు ధర ఇతర సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు రైతులకు కంట్రోల్‌ రూమ్‌ ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తుందని, ఫిర్యాదుల కోసం 93474 16178 నంబర్‌ను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ, డీఆర్డీఓ చంద్రశేఖర్‌ రెడ్డి, ఏడీ మైన్స్‌ జయరాజు, పీడీ హౌసింగ్‌ సూర్యనారాయణ, సివిల్‌ సప్లై డీఎం కృష్ణవేణి, డిప్యూటీ తహసీల్దార్‌ విజయ్‌ కుమార్‌, టెలికాం సంస్థల ప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement