ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

భూపాలపల్లి: ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని, అన్యాక్రాంతం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రభుత్వ భూములు, చెరువులు పరిరక్షణ, కోర్టు కేసులు, కౌంటర్లు దాఖలు తదితర అంశాలపై భూ పాలపల్లి నియోజకవర్గ రెవెన్యూ, అటవీ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, సింగరేణి తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన రైతులను గుర్తించి సమగ్ర సర్వే నిర్వహించి భూ హక్కు పత్రాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. సర్వే ప్రక్రియను వేగవంతం చేయడానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని సర్వే అండ్‌ ల్యాండ్‌ ఏడీకి సూచించారు. సర్వే కోసం నిర్ణయించిన గడువులో పనులు పూర్తి అయ్యేలా ఆర్డీఓ తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

ప్రజలకు అవగాహన కల్పించాలి..

పైపుల ద్వారా సహజ వాయువు వినియోగాన్ని పెంచడం ద్వారా ఎల్‌పీజీ వినియోగం తగ్గించాలనే లక్ష్యంతో, సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ మౌలిక వసతుల విస్తరణ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి నగర గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ విస్తరణ, వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా పరిస్థితులు, పైపుల ద్వారా సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించే అంశాలపై రెవెన్యూ, పోలీసు, అటవీ, పౌర సరఫరాలు, మున్సిపల్‌, పంచాయతీ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సంక్షోభం కారణంగా దేశంలో ఎల్‌పీజీ సరఫరా లపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో, భారత, రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక చర్యలను చేపట్టినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అరైవ్‌ అలైవ్‌ సమర్థవంతంగా

అమలు చేయాలి..

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చేపట్టిన అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ వెల్లడించారు. డీజీపీ శివధర్‌రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రి ష్ణారావు గురువారం జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, అదనపు కలెక్టర్‌అశోక్‌కుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement