● 32 ఆవులు గోశాలకు తరలింపు
వాజేడు: మండలంలోని మండపాక వద్ద 163వ నంబర్ జాతీయ రహదారిపై గోవులను తరలిస్తున్న నాలుగు బొలేరో వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మూగజీవాలను అక్రమంగా తరలిస్తున్న విషయం తెలుసుకున్న ఎస్సై జక్కుల సతీశ్ ఆధ్వర్యంలో గురువారం పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల సంతలో గోవులను కొని నాలుగు బొలేరో వాహనాల్లో వరంగల్ మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో మండపాక వద్ద జాతీయ రహదారిపై కాపు కాశారు. అటుగా వచ్చిన బొలెరో వాహనాలను ఆపి తనిఖీ చేశారు వాటిలో 32 పశువులు ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పశువులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేయడంతో పాటు భూపాలపల్లి జిల్లాలోని రాంపూర్ గోశాలకు గోవులను తరలించారు. పశువులను అక్రమంగా తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలను తీసుకుంటామని ఎస్సై సతీశ్ హెచ్చరించారు.


