పురాతన విగ్రహాలను శుభ్రంచేసే పని మాది. ద్రాక్షారామం, సామర్లకోట, డిక్కవోలులో పురాతన విగ్రహాలను శుభ్రం చేశాం. ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయి న మురికిని ఏఎస్‌ఏ, ఆర్కియాలజీశాఖ ఆధ్వర్యంలో ఆర్థోపాస్పరిక్‌యాసిడ్, అమోనియా, టీఫాల్ చ అనే రసాయనాలను నీటితో కలిపి విగ్రహాలపై ఉన్న నాచు, సున్నం, సిమెంట్, మురికిని కడిగి తొ లిగిస్తున్నాం. 105 విగ్రహాలు తీసుకువచ్చారు. రెండురోజుల్లో పూర్తి చేస్తాం. ఆ తరువాత భిన్నమైన, విరిగిన విగ్రహాలను అతికించే టీం వస్తుంది.
– జి.రమణ, క్లీనింగ్ మేసీ్త్ర,
ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్
చాళుక్యులు, కాకతీయుల కాలంనాటి పాత విగ్రహాలు నిరాధరణకు గురయ్యాయి. గతంలో పలుమార్లు ఆర్కియాలజీశాఖ పరిశీలనలకే పరిమితం చేశారు. ప్రస్తుతం దేవాదాయశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి విగ్రహాలను మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం, శిల్పకళకు మెరుగులు దిద్దడం శుభపరిణామం. ప్రతీ విగ్రహానికి ఒక్కో చరిత్ర ఉంది. విగ్రహాల ఆధారంగా భవిష్యత్ తరాలకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరాలయం అభివృద్ధికి ఇదొక అడుగు.
– త్రిపురారి కృష్ణమూర్తిశర్మ,
కాళేశ్వరం దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకుడు
కాళేశ్వరం దేవస్థానం పరిధిలో పురాతన విగ్రహాలను ఒక చోటకు చేర్చి విగ్రహాలపై రీసెర్చ్ చేస్తున్నాం. రిపోర్డు వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుపుతాం. ప్రత్యేక రసాయనాలతో విగ్రహాలను శుభ్రం చేస్తున్నాం. చాళుక్యులు, కాకతీయుల కాలంనాటి విగ్రహాలుగా కనిపిస్తున్నాయి. ఉన్నతాధికా రుల ఆదేశాలతో వివరాలు త్వరలో తెలియజేస్తాం.
– మాధవి, పురావస్తుశాఖ,
అసిస్టెంట్ డైరెక్టర్, హైదరాబాద్


