బాల్య వివాహాల నిర్మూలనలో వీసీపీసీల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల నిర్మూలనలో వీసీపీసీల పాత్ర కీలకం

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

బాల్య వివాహాల నిర్మూలనలో వీసీపీసీల పాత్ర కీలకం ట్రెంచ్‌లో పడి ఆవు మృతి

ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో వీలేజ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ (వీసీపీసీల) పాత్ర కీలకమని జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన బాలల పరిరక్షణ, బాల వివాహాల నిర్మూలనపై చెల్పాక, చిన్నబోయినపల్లి సెక్టార్లలోని అంగన్‌వాడీ టీచర్లకు నిర్వహించిన అవగాహన సదస్సుకు డీడబ్ల్యూఓ హాజరై మాట్లాడారు. బాలల హక్కుల పరిరక్షణలో వీసీపీసీ(వీలేజ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీ) పాత్ర కీలకమని, ప్రతీ నెలా గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్‌ అధ్యక్షతన గ్రామ బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు పుష్పావతి, వసంత, పోషణ్‌ అభియాన్‌ బ్లాక్‌ కో–ఆర్డినేటర్‌ ఇమ్మాన్యూఝెల్‌, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

ఏటూరునాగారం: మండలంలోని గంటలకుంట అటవీ సమీపంలోని గొత్తికోయగూడేల్లో అటవీశాఖ అధికారులు తీసిన ట్రెంచ్‌లో పడి గురువారం ఒక ఆవు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు గోతులు తీయడంతోనే ఆవు మృతి చెందిందని గొత్తికోయ గిరిజనులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement