బాల్యానికి బంధనం | - | Sakshi
Sakshi News home page

బాల్యానికి బంధనం

Apr 9 2026 7:29 AM | Updated on Apr 9 2026 7:29 AM

బాల్యానికి బంధనం గ్రామాల్లోనే అధికంగా.. చట్టరీత్యా నేరం

బాల్యవివాహాలు చేస్తే

శిక్షలు ఇలా..

జిల్లాలో పెరిగిపోతున్న బాల్యవివాహాలు

పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేసిన అమ్మాయిలకు గ్రామాల్లో వివాహాలు చేస్తున్నారు. దీంతో వారు ఊహించుకున్న భవిష్యత్‌ దక్కకుండా పోతుంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే బాల్య వివాహాలు అత్యధికంగా జరుగుతున్నాయి. దీంతో చదువుకు బ్రేక్‌ పడి ఇంటి బాధ్యతలు, వంటింటికే పరిమితం కావాల్సి వస్తుంది.

భూపాలపల్లి రూరల్‌: ఆడపిల్లలకు వయస్సు రాగానే పెళ్లి చేయాలనే ఆరాటం తల్లిదండ్రుల్లో ఎక్కువగా పెరిగిపోతుంది. ఆడపిల్ల పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుందని చాలా మంది భావిస్తూ మాంగళ్యతంతు ముగించేస్తున్నారు. చిన్నతనంలోనే పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోనే ఇవి ఎక్కువగా నమోదవుతున్నాయి. అధికారులు సమాచారంతో బాల్య వివాహాలను అడ్డుకొని వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నా.. చాలా మంది తీరులో మార్పు రావడం లేదు.

అవగాహన కల్పిస్తున్నా..

బాల్య వివాహాల కట్టడికి జిల్లాలో మాతా శిశు సంరక్షణ అధి కారులు తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి మాత్రం ఆగ డం లేదు. తమకున్న సమాచారంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి బాలికలతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతవరకు ఇవి తగ్గినట్లు కనిపిస్తున్నా.. లోలోపల మా త్రం గుట్టుచప్పుడు కాకుండా పూర్తయ్యేవి అనేకం ఉంటున్నాయి.

ఆర్థిక ఇబ్బందులు.. పిల్లల ప్రవర్తన

చాలాచోట్ల జరుగుతున్న బాల్య వివాహాలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. తమకంటే ఆర్థికంగా ఉన్న కుటుంబాల వారికి తమ కూతుళ్లను పెళ్లి చేసి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. దీంతో తమ అమ్మాయి జీవితం బాగుంటుందని ఆశపడుతున్నారు. మరికొందరైతే సోషల్‌ మీడియా ప్రభావంతో పిల్లలు పెడదారి పరుతున్నారని ఆలోచించి చిన్న వయస్సులోనే గుట్టు చప్పుడుకాకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు.

బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. సమాచారం ఇస్తే అధికారులు వెంటనే అడ్డుకునేలా చర్యలు చేపడుతాం. గతంతో పోలిస్తే ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. బాల్య వివాహాల నియంత్రణ, బాలల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098కు సమాచారం అందించాలి.

– మల్లీశ్వరి, జిల్లా సంక్షేమాధికారి

బాల్య వివాహాలు చేస్తే అమ్మాయి తండ్రికి, అబ్బాయి తండ్రికి రూ.లక్ష జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. అబ్బాయి మేజర్‌ అయినట్లయితే ఆయనకు సైతం ఫైన్‌తో పాటు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఒకవేళ మైనర్‌ అయితే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇస్తారు.

అంధకారం అవుతున్న భవిష్యత్‌

అడ్డుకుంటున్నా.. ఆగని పెళ్లిళ్లు

గ్రామాల్లోనే అధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement